AP: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. 29వ వార్డులో YCP నుంచి సుమారు 100 మంది యువకులు ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ సమక్షంలో ఆదివారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతి ఒక్కరు జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని పలువురు తెలిపారు. పార్టీ అధిష్టానం ప్రకారం నడచుకొని ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామన్నారు. కాగా, ఇటీవల వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్న విషయం విధితమే.