వైసీపీ ఆ భవనం ఖాళీ చేయాల్సిందే!: అశోక్ గజపతిరాజు

AP: పూసపాటి రాజవంశీయుడు అశోక్ గజపతిరాజు, తమ కుటుంబానికి చెందిన ప్రైవేట్ భూమిని వైసీపీ కార్యాలయం కోసం 33 ఏళ్ల లీజుకు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వందల ఏళ్ల నాటి ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి లీజుకు ఇచ్చారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. అశోక్ గజపతిరాజు చేస్తున్న పోరాటంతో, వైసీపీ కార్యాలయ భవనాన్ని ఖాళీ చేయాల్సి వస్తుందని, ఇది ఆ పార్టీకి అవమానకరమని తెలుస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అశోక్ గజపతిరాజు ఫిర్యాదుతో యంత్రాంగం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.

సంబంధిత పోస్ట్