వైసీపీకి షాక్.. వలిరెడ్డి శిరీష రాజీనామా

AP: స్థానిక ఎన్నికల వేళ వైసీపీకి షాక్ తగిలింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి జడ్పీటీసీ పదవికి వలిరెడ్డి శిరీష రాజీనామా చేశారు. అలాగే వైసీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా ఆమె రాజీనామా చేశారు. శిరీషతో పాటు ఆమె భర్త వలిరెడ్డి శ్రీనివాస నాయుడు కూడా పార్టీని వీడారు. వైసీపీ ప్రచార విభాగం జిల్లా అధ్యక్ష పదవికి శ్రీనివాస నాయుడు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు వలిరెడ్డి దంపతులు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్

✕
✕