షాకింగ్ ఘటన .. స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు

AP: అనకాపల్లి జిల్లా, యలమంచిలి పురపోరు ఓట్ల లెక్కింపులో విచిత్రమైన ఫలితాలు నమోదయ్యాయి. 7వ వార్డులో ఏసీ గుర్తుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మళ్ల రామకృష్ణకు కేవలం ఒకే ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. కనీసం తన కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయకపోవడం గమనార్హం. అదే వార్డులో నోటాకు 6, కాంగ్రెస్ అభ్యర్థికి 6 ఓట్లు పడ్డాయి. ఇతర వార్డుల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు అతి తక్కువ ఓట్లు వచ్చాయి. 13వ వార్డులో 8 ఓట్లు, 18వ వార్డులో 13 ఓట్లు, 21వ వార్డులో 9 ఓట్లు మాత్రమే స్వతంత్ర అభ్యర్థులకు లభించాయి.

సంబంధిత పోస్ట్

✕
✕