AP: కడప జిల్లా, నందలూరులో టీడీపీకి చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఎద్దుల విజయసాగర్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఓ కారు ధ్వంసం కాగా, మరో కారుకు దుండగులు నిప్పు పెట్టారు. బాలసుబ్రహ్మణ్యం గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనతో నందలూరులో ఉద్రిక్తత నెలకొంది.