వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి అరెస్ట్ తప్పదా?

AP: వైఎస్ జగన్‌కు త్వరలో భారీ షాక్ తగలనుంది. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్టు తప్పదా అనే అంశంపై ప్రచారం జరుగుతోంది. ఆయనపై ఓటుకు నోటు, అక్రమ మైనింగ్ వంటి పాత కేసులతో పాటు, తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాల కబ్జాలో పెద్దిరెడ్డికి సంబంధం ఉందని తెలిపారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో పెద్దిరెడ్డిని త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్