AP: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నిలకడ లేని మనస్తత్వం ఉందని, పార్టీ పెట్టడానికి పనికిరాడని కొందరు విమర్శించారని వెల్లడించారు. అలాగే వైపీసీపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పార్టీ పెట్టాలంటే 'నాన్న సీఎం అయ్యి ఉండాలా?.. లేక మామ కేంద్ర మంత్రి అయ్యి ఉండాలా..? లేక బాబాయిని చంపించి ఉండాలా..? అని పవన్ ప్రశ్నించారు.