ఎంపీ YS అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా?

AP: వైఎస్ వివేకా హత్య కేసులో YCP ఎంపీ అవినాశ్ రెడ్డికి త్వరలో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రూ.40 కోట్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ఇప్పటికే ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలను ప్రశ్నించింది. ఈ నెల 14న అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕