వైసీపీ నేతల బూతుల తిట్లు, జగన్ తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. 'రౌడీయిజం చేస్తే ఊరుకోవాలా? రాజ్యాంగంపై గౌరవం లేదు, సీఎం, డిప్యూటీ సీఎం అంటే లెక్కలేదు' అని ఆయన మండిపడ్డారు. నెయ్యిలో కల్తి లేదని సీబీఐ నివేదికలో ఎక్కడా చెప్పలేదని, జగన్ కరడుకట్టిన నేరస్థుడిలా మాట్లాడారని చంద్రబాబు ఆరోపించారు. దేవుడికి అపచారం జరిగినప్పుడు అందరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.