AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఉచ్చు బిగుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేయడంతో, ఆయన భార్య, కుమారుడు విచారణాధికారుల ముందు హాజరయ్యారు. చెవిరెడ్డి భార్య పేరు మీద పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, లిక్కర్ స్కాం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.