రొయ్యల మేత ధరలు పెంపు.. నేటి నుంచే అమలు

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులకు ఫీడ్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. వనామీ రకం రొయ్యల మేతపై కిలోకు రూ.10, టైగర్ రొయ్యల మేతపై కిలోకు రూ.12 చొప్పున ధరలు పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి వచ్చాయి. నెల రోజుల క్రితమే కిలోకు రూ.4 పెంచిన కంపెనీలు తాజాగా మరోసారి ధరలు పెంచడంతో రైతులపై అదనపు భారం పడనుంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో రొయ్యల ధరలు తగ్గుముఖం పట్టగా, మేత ధరల పెంపుతో సాగు వ్యయం మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత పోస్ట్