AP: జగన్ కారు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన సింగయ్య కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయింది. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం ఎస్సీ కాలనీకి చెందిన సింగయ్య ప్లంబర్‌గా పని చేస్తూ జీవనం సాగించేవారు. వచ్చే ఆదాయంతోనే భార్యాపిల్లలను పోషించుకునేవారు. సింగయ్య మరణించడంతో ఆ చిన్న కుటుంబం బతుకుదెరువు కోల్పోయింది. భర్త సింగయ్య మృతితో తమకు దిక్కులేకుండా పోయిందని ఆయన భార్య లూర్థు మేరీ ఆవేదన వ్యక్తం చేశారు. తామెలా బతకాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.