విశాఖ ఎన్నికల్లో సత్తా చాటిన అక్కాచెల్లెలు

AP: విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెలు రాజకీయ విజయాన్ని నమోదు చేశారు. కూటమి తరఫున టీడీపీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన ముక్కా శ్రావణి ఘనవిజయం సాధించగా, ఆమె సోదరి పొట్నూరు నీలవేణి 49వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. గతంలో శ్రావణి ఇదే వార్డు నుంచి కార్పొరేటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇద్దరు కుమార్తెల ఈ ఎన్నికల విజయంతో వారి తండ్రి, టీడీపీ సీనియర్ నాయకుడు ముక్కా ముత్యాల నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్

✕
✕