AP: సీఎం చంద్రబాబు తిరుమల ప్రసాదంపైన నీచమైన అబద్ధపు ప్రచారాలు చేశారని, సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛార్జ్‌షీట్ తేల్చి చెప్పిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి తెలిపారు. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధాలని సిట్ తేల్చిందని, అయినా చంద్రబాబు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్ లడ్డూపై దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని, వారి పాపాలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మండిపడ్డారు.