మద్యం అక్రమాలపై 'సిట్' ఏర్పాటు

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. 2019 నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం విక్రయాలపై ఈ సిట్ దర్యాప్తు చేయనుంది. విజయవాడ సీపీ రాజశేఖర్ దీనికి నేతృత్వం వహించనున్నారు. మొత్తం ఏడుగురు సభ్యులతో ఈ సిట్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ అడిగిన సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్