AP: మద్యంలో జరిగిన అక్రమాలపై సిట్ విచారణ ముమ్మరం చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా వ్యవహరించిన సీఆర్‌డీఏ సీఈఓ వివేక్ యాదవ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నేడు ఆయన కార్యాలయంలోనే ప్రత్యక్షంగా విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. ప్రధానంగా ఆన్‌లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (OFS) విధానం, మద్యం సరఫరా కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై అధికారులు ప్రశ్నించనున్నారు.