తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యి సరఫరా కేసు విచారణలో సిట్ వేగం పెంచింది. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించింది. నిన్న అరెస్టు చేసిన నలుగురినీ ఏ-2 నుంచి ఏ-5గా చేర్చింది. అలాగే, ఏ-8గా వైష్ణవి డెయిరీ సీఈవో సబల్ షమీముల్లాఖాన్‌ను పేర్కొంది. అయితే, ఈ కేసులో ఆధారాలను చెరిపివేసేందుకు నిందితులు తమ ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని సిట్ వెల్లడించింది.