ఏపీలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి: జగన్

AP: రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వలేదని మండిపడ్డారు. నామినేషన్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారని, పోలీసుల సహకారంతోనే వారు వస్తున్నారన్నారు. వైసీపీ అభ్యర్థులతో నలుగురికే అనుమతి ఇస్తున్నారని, కొన్ని చోట్ల నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేస్తున్నారని అన్నారు. పోలీసుల కళ్ల ముందే నామినేషన్ ప్రక్రియను అడ్డుకున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్

✕
✕