విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై సుమారు రూ.7 కోట్ల వ్యయంతో గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ నిర్మిస్తు్న్నారు. 55 మీటర్ల పొడవైన గ్లాస్ స్కైవాక్ వంతెన నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. VMRDA ఈ స్కైవాక్ వంతెనను అభివృద్ధి చేస్తుంది. ఈ వంతెన పై నుంచి సముద్రం, కైలాసగిరి కొండ, బీచ్ ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. స్కైవాక్ వంతెన నగరంలో ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారనుంది.