తిరువూరులో చిన్ని మనుషుల గంజాయి వ్యాపారం: టీడీపీ ఎమ్మెల్యే

AP: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘తిరువూరులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మనుషులు గంజాయి వ్యాపారం చేస్తున్నారు. భద్రాచలం నుంచి గంజాయిని తీసుకొచ్చి తిరువూరులో అమ్ముతున్నారు’ అని వ్యాఖ్యానించారు. దాంతో కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్న ఎమ్మెల్యే టికెట్ కోసం తన దగ్గర నుంచి కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నాడని కొలికపూడి ఆరోపించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్