AP: రాష్ట్రంలో రేషన్ సరకుల పంపిణీలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేద కుటుంబాలకు ఆగస్టు 25 నుంచి 31 వరకు క్యూఆర్ కోడ్ తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయనుంది. కొత్త కార్డులపై ముఖ్యమంత్రి సహా రాజకీయ నాయకుల ఫొటోలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. కేవలం ఆయా కుటుంబ సభ్యుల పేర్లు, వారి చిత్రాలు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. దీంతో ఇక నుంచి రేషన్ సరకుల కోసం స్మార్ట్ రేషన్ కార్డులను వాడనున్నారు.