సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: ఎస్‌ఈసీ

ఆంధ్రప్రదేశ్‌లో మూడు దశల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠా కీలక సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. పల్నాడు, ఆ దిగువ జిల్లాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన ఎస్‌ఈసీ, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించారు. ఏకగ్రీవాల వల్ల అదనపు బలగాలు అందుబాటులోకి వస్తాయని, బలవంతపు ఏకగ్రీవాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕