AP: కృష్ణా జిల్లా పామర్రు కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా పాము ప్రత్యక్షమై కలకలం సృష్టించింది. ఒక్కసారిగా పాము లోపలికి రావడంతో కౌంటింగ్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పామర్రు సీఐ చిన్నీ నాగప్రసాద్ చాకచక్యంగా పామును పట్టుకుని బయట సురక్షితంగా వదిలిపెట్టారు. దీంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.