సాఫ్ట్‌వేర్‌ సీఈవో.. ఎంపీటీసీగా విజయం

AP: సాఫ్ట్‌వేర్‌ సంస్థ సీఈవోగా పనిచేస్తున్న కూనపరెడ్డి వెంకటరత్నప్రసాద్‌ జనసేన తరఫున కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్‌ తాళ్లపాలెం-2 ఎంపీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. మేకావానిపాలెంకు చెందిన ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంసీఏ పూర్తి చేసి, ఎపెక్స్‌ న్యూరా టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవోగా కొనసాగుతున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై అభిమానంతో మచిలీపట్నం వచ్చి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన ఆయన.. సాఫ్ట్‌వేర్‌ వృత్తిని కూడా కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕