భారత ఉపఖండంలోకి గురువారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఇప్పటికే కేరళలో తొలకరి వర్షాలు ప్రారంభమయ్యాయి. కేరళ, తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. జూన్ 15 నాటికి రాష్ట్రం మొత్తం రుతుపవనాలు విస్తరించవచ్చని అంచనా. రాబోయే వారం రోజులు ఏపీలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.