తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పనిచేస్తున్న తమిళనాడు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా, ఈనెల 23న పెయిడ్ హాలిడే (వేతనంతో కూడిన సెలవు) ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తిస్తుంది. సరిహద్దు జిల్లాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది.