AP: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని నదులలో కాలుష్యాన్ని నివారించేందుకు ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. రాజమండ్రి పర్యటనలో గోదావరి నది కలుషితమవడాన్ని గుర్తించిన నేపథ్యంలో, ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం అటవీ శాఖ నుంచి జీవో జారీ అయింది. ఈ టాస్క్‌ఫోర్స్ గోదావరితో పాటు ఇతర ప్రధాన నదులలో కాలుష్య నివారణకు కృషి చేస్తుంది.