సంఘం వద్ద పెన్నా నదిలో పడి ఓ వ్యక్తి మృతి

నెల్లూరు జిల్లాలోని సంఘం వద్ద పెన్నానదిలో పడి శుక్రవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. సంఘం లోని బేరి కట్ట వీధి వద్ద అతని మృతదేహం ప్రత్యక్షమైంది. మృతి చెందిన వ్యక్తి నెల్లూరుకు చెందిన నక్కల బుజ్జి బాబు గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతను మృతి చెందడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్