నంద్యాల జిల్లా నుంచి నెల్లూరు రొట్టెల పండుగకు వెళ్తున్న యాత్రికుల టాటా ఏసీ వాహనాన్ని సంగం మండలం తరుణవాయి సమీప హైవేపై లారీ ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువతి అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువతి తీవ్రంగా గాయపడింది. గాయపడిన యువతిని 108 అంబులెన్స్ ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా పరారైనట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు, పరారైన లారీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.