అనంతసాగరం మండలం పరిధిలోని లింగంగుంట గ్రామం వద్ద ప్రమాదవశాత్తు కారు ఆటోను ఢీకొట్టిన సంఘటన సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం వెంగంపల్లికి చెందిన ఆటో అనంతసాగరం నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఆత్మకూరు నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆటోలో ఉన్న మహిళకు స్వల్ప గాయలు కావడంతో వైద్యశాలకు తరలించారు. కారు, ఆటో ముందు భాగాలు కొంతమేర దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు.