ఆత్మకూరు రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద గురువారం చోటు చేసుకున్న దొంగతనం ఘటన కలకలం రేపింది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఏఎస్ పేటకు చెందిన శ్రీనివాసులును లక్ష్యంగా చేసుకున్న గుర్తు తెలియని దుండగులు, అతని కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న రూ.8.90 లక్షల నగదును అపహరించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పూర్తి వివరాలు వెలుగు చూడాల్సి ఉంది.