నెల్లూరు జిల్లా ఆత్మకూరు లోని జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దగ్గర భారీగా మంటలు, పొగలు శనివారం ఏర్పడ్డాయి. దీంతో ఒక్కసారిగా కళాశాలలోని విద్యార్థులు చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.