ఆదురుపల్లి బస్టాండ్ వద్ద ఆటో-కారు ఢీ.. ప్రాణాపాయం తప్పింది

చేజర్ల మండలం ఆదురుపల్లి బస్టాండ్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెంచలకోన వైపు నుంచి వస్తున్న ఆటో అదుపుతప్పి, బస్టాండ్ వద్ద మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారుకు తీవ్ర నష్టం వాటిల్లింది. కారు డోర్ దెబ్బతిని, ఒక టైర్ పగిలిపోయింది. అయితే, వాహనాల్లో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్