నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని ఓ ఇంటిలో చోరీ జరిగిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.పట్టణంలోని దర్గా వెనుక వైపు వీధిలో ఓ వృద్ధురాలు ఒంటరిగా ఇంటిలో నిద్ర పోతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి లక్ష రూపాయలు నగదు, వెండి నగలు దోచుకెళ్ళాడు. నిద్ర లేచేసరికి బీరువా పగలకొట్టి ఉండడంతో బాధితవృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.