పొదలకూరు స్వర్ణ లేఅవుట్ సమీపంలో సోమవారం సాయంత్రం దాన్యం లారీ బైక్ ను ఢీకొట్టిన ప్రమాదంలో చేజర్ల(మం) చిత్తలూరుకు చెందిన బండి రామయ్య అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్య శ్రీవాణికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు నెల్లూరు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కుమారుడికి ఇంటర్లో ఆశించిన మార్కులు రాలేదని ఇంప్రూవ్మెంట్ నిమిత్తం నెల్లూరులోని ఓ కళాశాలలో చేర్చి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.