సంఘం వద్ద పెన్నా నదిలో ఓ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. శనివారం పోలీసులు తెలిపిన కథనం ప్రకారం. సంఘం లోని బ్రహ్మోత్సవాల సందర్భంగా దుకాణం పెట్టుకుని జీవనోపాధి పొందాలని వచ్చిన నెల్లూరుకు చెందిన నక్కల బుజ్జి(35) శుక్రవారం వేకువ జామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు పెన్నా నది వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటమనిగి మృతి చెందారు. మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.