నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం: ఆత్మకూరు ఆర్డీవో

ఆత్మకూరు పట్టణంలో చెత్తకుప్పలో ఎన్నికల సామాగ్రి కలకలంపై ఆత్మకూరు ఆర్డీవో పావని స్పందించారు. 2019 ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని కార్యాలయంలో భద్రపరచడం జరిగిందన్నారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా కార్యాలయం నుండి తీసుకుని వెళ్లి బయటపడేశారు అని ఆర్డీఓ తెలిపారు. పోలీసుల దర్యాప్తు జరుగుతూ ఉందని, త్వరలోనే నిందితులను పట్టుకొని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్