బిల్లుపాడు గ్రామానికి చెందిన ఉల్లిపాయల శ్రావణి నిర్వహిస్తున్న My Dear Nellore ఇన్స్టాగ్రామ్ పేజీ 50 వేల మంది ఫాలోవర్లను చేరుకున్న సందర్భంగా బిల్లుపాడు పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న 140 మంది విద్యార్థులకు సుమారు రూ. 20, 000 విలువైన నోట్‌బుక్స్, ప్యాడ్స్, జామెట్రీ బాక్సులు, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేశారు. విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శ్రావణి తెలిపారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.