రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మర్రిపాడు మండలంలో బుధవారం రాత్రి జరిగింది. మర్రిపాడు మండలం బాట వద్ద జాతీయ రహదారిపై నడిచి వెళుతున్న ఒక వ్యక్తిని బొలెరో వాహనం ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. మృతి చెందిన వ్యక్తి ఏనేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన చెన్నయ్య గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.