నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి అటవీప్రాంతంలో కారులోని రూ.3.60 కోట్ల నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 565 జాతీయ రహదారిపై అనుమానాస్పదంగా నిలిచి ఉన్న కారును గుర్తించి స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. కారు నెంబర్ ఆధారంగా యాజమానికి ఫోన్ చేయగా, కారులో రూ.4.5 కోట్లను గుమస్తా, డ్రైవర్తో పంపించానని తెలిపారు. జీపీఎస్ సిగ్నల్ అందకపోవడంతో యాజమాని ఆందోళనలో ఉన్నట్లు పోలీసులకు వివరించారు. కారులో ప్రత్యేక లాకర్‌లో ఉన్న నగదును ఎత్తుకెళ్లినట్లు నలుగురు నిందితులు అంగీకరించారు.