నెల్లూరు జిల్లా సంఘం మండలం టోల్ గేట్ సమీపంలో అక్రమ రేషన్ బియ్యం వాహనాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో సుమారు రెండున్నర టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ రేషన్ బియ్యాన్ని నాగుల వెల్లటూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లుగా సమాచారం.