నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ లిఖిత్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమత్తులు కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.