ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ప్రభుత్వ ఉద్యోగికి తీవ్ర గాయాలైన ఘటన వుడ్ హౌస్ పేట వద్ద నెల్లూరు- ముంబై జాతియ రహదారిపై శుక్రవారం జరిగింది. ఆత్మకూరుకు చెందిన శ్రీనివాసులు అనంతసాగరం లో అటవీ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఆత్మకూరు వెళుతుండగా ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని వెంటనే 108 వాహనం ద్వారా ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు.