అనంతసాగరం మండలం రేవూరు కు చెందిన ప్రశాంత్(30) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ క్రమంలో సోమవారం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్సకు వచ్చారు. అక్కడి నుంచి నెల్లూరు ప్రభుత్వం వైద్యశాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ వ్యక్తిని సంగంలోని పీహెచ్సీకి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.