కందుకూరు పట్టణంలో మరో దొంగతనం

కందుకూరులో మరో దొంగతనం శుక్రవారం వెలుగు చూసింది. కందుకూరు పట్టణంలోని గ్రంథాలయం వెదురు బజారులో పసుపులేటి రాజేశ్వరి నివాసంలో చోరీ జరిగింది. రాజేశ్వరి టంగుటూరులోని తన కూతురు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువా తలుపులు తొలగించి పదివేల నగదు, 10 సవర్ల బంగారం చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్