కందుకూరు: ప్రశ్నించినందుకు దాడి

మురుగునీరు ప్రవహిస్తుండడంపై అభ్యంతరం తెలిపిన వారిపై దాడి జరిగిన సంఘటన కందుకూరు మండలం పలుకూరు పంచాయతీలోని పంటవారి పాలెంలో గురువారం జరిగింది. ఎస్ఐ బాల మహేందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, మన్నం నరసింహారావు ఇంటికి వెళ్లే మార్గంలో మురుగునీరు వస్తుండడంతో పక్కింటి వారైన అంకాయమ్మ, రాఘవయ్య, కృష్ణయ్యలను ప్రశ్నించారు. దీంతో వారు నరసింహారావు ఆయన భార్యపై దాడి చేశారు. ఈ మేరకు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్