కందుకూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

నెల్లూరు జిల్లా కందుకూరు మండలం ఓగూరు సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఓగూరు గ్రామానికి చెందిన గంగారపు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఎక్సెల్ బైక్‌పై పొలానికి వెళ్తుండగా మార్గమధ్యలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థానానికి చేరుకున్న ఎస్ఐ మహేంద్ర నాయక్ పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్