నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం తిమ్మారెడ్డి పాలెం లోని ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఈనెల 20న నిర్వహించాల్సిన పరీక్షను 21వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ మహమ్మద్ అఫ్తార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.