కందుకూరులోని పలు ప్రాంతాలలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కోవూరు రోడ్డులో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నందున బలరామయ్య తోట, సాయి నగర్, విజయనగర్ కాలనీ, ఐఎస్ రావు నగర్, 60 అడుగుల రోడ్డు ప్రాంతాలలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ టౌన్ ఏఈ నరసింహం తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.