ఉలవపాడు మండలం కరేడు తీరంలో గల్లంతైన బాలుడు మృతదేహం శుక్రవారం పొగురు వద్ద లభ్యమయ్యింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కరేడు గ్రామం చిన్న పల్లి పాలానికి చెందిన శింగోతు హేమంత్(17) ఇటీవల ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పూర్తి చేశారు. సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి గురువారం సముద్ర తీరానికి వెళ్లారు. అందరూ కలిసి మునుగుతుండగా పెద్ద అల రావడంతో హేమంత్ గల్లంతయ్యారు. శుక్రవారం మృతదేహం కొట్టుకొచ్చింది.